Thursday, March 10, 2011

ఆందోళన... ఆగ్రహం... గర్హనీయం









































ఆందోళనకారులు చేపట్టిన మిలీనియం మార్చ్ కార్యక్రమము హింసాత్మకం కావడం, టాంకుబండు పైన ఉన్న విగ్రహాలను ద్వంసంచేయడం విచారకరం. ప్రభుత్వం, ఆందోళనకారులు పట్టుదలకు పోవడంతోనే ఈ సంగటనలు జరిగయీ. ఏదేమైనా తెలుగు జాతికి అభివ్రిద్దికి ఎంతో కృషి చేసిన ద్వంసంచేయడం విచారకరం. ఎంతో ప్రాధాన్యత కలిగిన టాంకుబండు ఇక బోసిపోయింది. ప్రాంతాలతో సంబంధం లేకుండా చరిత్రలో నిలిచినా మహనీయుల ప్రతిమలకు బుద్దుని సాక్షిగా అగౌరవం జరిగింది. తెలుగుజాతి చరిత్రలో యిది ఒక దుర్దినం.



Thursday, March 3, 2011


ప్రణబ్‌ మాయాజాలం

స్థూల జాతీయోత్పత్తిలో జిడిపి 5.5 శాతం ఉంటుందని 2010-11 బడ్జెట్‌ అంచనా వేసింది. సవరించిన అంచనాల మేరకు 2010-11లో ఈ ద్రవ్యలోటును 4.6 శాతానికి తగ్గించగలిగామని ప్రణబ్‌ ముఖర్జీ జబ్బలు చర్చుకున్నారు. కానీ వాస్తవం ఏమిటి ? ఈ ద్రవ్యలోటు నియంత్రణ ఎలా సాధ్యమైంది? ఒకవైపు కొన్ని కేటాయింపులు చేసినట్లు చూపిస్తూనే, మరోవైపు సబ్సిడీల కేటాయింపుల్లో కత్తెర వేశారు. సామాన్యులను ప్రభావితం చేస్తున్న అంశాలపై చర్యలు తీసుకోకుండానే తీసుఁంటున్నామనిచెబుతున్న యుపిఎ-2 ప్రభుత్వం చేసిన మాయాజాలం ఏంటి? మరిన్ని వివరాలు.....

ఆర్థిక మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ ఇటీవల ప్రతిపాదించిన బడ్జెట్‌ తీరు తెన్నులు పరిశీలిస్తే దేశం ముందున్న రాజకీయ ఆర్థిక సమస్యల పరిష్కారాఁకిగాక విదేశీ, స్వదేశీ గుత్తపెట్టుబడుల అవసరాలు తీర్చటమే లక్ష్యంగా పెట్టుఁన్నట్లు కనిపిస్తోంది. నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్య సమానత్వంతో కూడిన అభివృద్ధి, దీన్ని సాధించటాఁకి అవసరమైన పరిపాలనా సామర్థ్యం. ఈ రెండు లక్షణాలను రుజువు చేసుకోవటాఁకి ప్రభుత్వాలఁ బడ్జెట్‌ ఒక అవకాశం. యుపిఏ-2 ప్రభుత్వం ఈ సందర్భాఁకి తగినట్లు వ్యవహరిచలేక పోయిందఁ బడ్జెట్‌ దిశ, అందులోఁ అంకెలు రుజువు చేస్తున్నాయి. బడ్జెట్‌ ప్రక్రియలో భాగంగా ఫిబ్రవరి మూడో వారంలో ప్రధానమంత్రి ఆర్థిక సలహామండలి జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థితిగతుల గురించి ఒక ఁవేదిక విడుదల చేసింది. ఆ ఁవేదికలో ఆర్థిక వ్యవస్థ ముందున్న నాలుగు ప్రధాన సవాళ్ల గురించి ప్రస్తావించింది. అవి ద్రవ్యోల్బణాఁ్న ఁయంత్రించటం, ద్రవ్య వ్యవస్థ స్థిరీకరణ, ఉత్పాదక రంగంలో కదలిక తేవటం, కరెంట్‌ ఖాతా లోటును తగ్గించుకోవటం. బడ్జెట్‌ ఈ నాలుగు సమస్యలను పరిష్కరించే దిశలో ఉండాలఁ హితబోధ చేసింది. కానీ ఈ బడ్జెట్‌ను పరిశీలిస్తే ఆ హితబోధ ప్రభుత్వాఁకి ఏమీ ఎక్కినట్లు కఁపించటం లేదు. ఒక్కో లక్ష్యం గురించి బడ్జెట్‌ ఏమంటుందో పరిశీలిద్దాం.
ద్రవ్యలోటు
స్థూల జాతీయోత్పత్తిలో ఇది 5.5 శాతం ఉంటుందఁ 2010-11 బడ్జెట్‌ అంచనా వేసింది. సవరించిన అంచనాల మేరఁ 2010-11లో ఈ ద్రవ్యలోటును 4.6 శాతాఁకి తగ్గించగలిగామఁ ప్రణబ్‌ ముఖర్జీ జబ్బలు చర్చుఁన్నారు. కానీ వాస్తవం ఏమిటి ? ఈ ద్రవ్యలోటు ఁయంత్రణ ఎలా సాధ్యమైంది? గత సంవత్సరం బడ్జెట్‌లో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా 40,000 కోట్లు రూపాయలు సంపాదించాలఁ లక్ష్యంగా పెట్టుఁన్నారు. మరో 34 వేల కోట్ల రూపాయలు 3జి స్పెక్ట్రం వేలం ద్వారా సంపాదించాలఁ లక్ష్యంగా ఁర్ణయించుఁన్నారు. ఈ రెండు మార్గాల ద్వారా ద్రవ్యలోటు పూడ్చుకోవాలఁ ప్రభుత్వం ఁర్ణయించింది. కానీ స్పెక్ట్రం వేలం ద్వారా లక్ష కోట్ల రూపాయల మేర ఆదాయం సంపాదించటంతో ప్రభుత్వం దగ్గర ఁల్వ రొక్కం విషయంలో కాస్తంత వెసులుబాటు వచ్చింది. అయాచితంగా వచ్చిన ఆదాయం ప్రభుత్వ లోటు పూడ్చటాఁకి ఉపయోగపడింది. ఇది ఒకసారి వచ్చే ఆదాయం మాత్రమే. ఏటా వచ్చే ఆదాయం కాదు. అంటే ఈ సంవత్సరం బడ్జెట్‌ అంచనాల్లో ఈమేరఁ ఆదాయాఁ్న తగ్గించి లెక్కవేసుకోవాలి. ఇంతవరఁ విశ్లేషఁలదంరూ చెప్పారు. కానీ విశ్లేషఁల దృష్టిఁ ఆకర్షించఁ మరో మార్గంలో కూడా ప్రభుత్వం లోటు తగ్గించే పఁకి పూనుకొంది. అది వివిధ ప్రభుత్వ పథకాలఁ కేటాయించిన ఁధులు ఖర్చు చేయఁండా ఉండటం. ఉదాహరణఁ గ్రామీణ ఉపాధి హామీ పథకం, సర్వశిక్షా అభియాన్‌, ఇందిరా ఆవాస్‌ యోజన, యాక్సెలరేటెడ్‌ ఇరిగేషన్‌ బెఁఫిట్‌ ప్రోగ్రాం, గ్రామీణ తాగు నీటి పథకాలఁ 2010-11 బడ్జెట్‌లో 92,510 కోట్లు కేటాయించగా 2010 డిసెంబరు చివరి నాటికి ఖర్చు చేసింది 48,757 కోట్లు మాత్రమే. అంటే కేటాయింపుల్లో దాదాపు సగం మాత్రమే ఖర్చు పెట్టి మిగిలిన సొమ్ము పొదుపు చేయటం ద్వారా ప్రభుత్వ ఖజానాలో ఎఁ్కవ డబ్బులు ఉండేలా చూసుఁంది. ఇవన్నీ వెరసి ఫిబ్రవరిలో లోటు లెక్కించే సమయాఁకి లోటును తఁ్కవ చేసి చూపాయి. 2011-12 ఆర్థిక సంవత్సరంలో ఈ పథకాలఁ మరింత తఁ్కవ కేటాయించారు. పైగా అయిదు రాష్ట్రాల ఎఁ్నకలను దృష్టిలో పెట్టుఁఁ ఆహార భద్రతా చట్టాఁ్న అమలు చేస్తామఁ బడ్జెట్‌ హామీ ఇచ్చింది. కానీ, నూతన పథకాఁకి బడ్జెట్‌ పద్దుల్లో స్థానం దక్కలేదు. కాబట్టి ఆహార భద్రత ఈ ఏడాది కూడా హూళక్కే! ఈ విధంగా ప్రజల కడుపు కాల్చి సంపాదించిన సొమ్ముతో లోటు భర్తీ చేసుకొంటోందీ ప్రభుత్వం.
ద్రవ్యోల్బణం
ప్రభుత్వ గణాంకాల్లో, వివరణల్లో ఒక పద్ధతి ఉంటుంది. వాస్తవిక పరిస్థితికి తగ్గట్లు సమాధానం చెప్పలేకపోతే చర్చ ప్రాతిపదికనే మార్చటం ఈ పద్ధతి. ద్రవ్యోల్బణం గురించి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ఇలాగే ఉంది. గత రెండేళ్ల పాటు ప్రజలను పీడిస్తున్న ధరాఘాతాఁకి మూలాలు పంపిణీ వ్యవస్థను ప్రజలకందుబాటులోకి తేలేకపోవటం, అంతర్జాతీయ పరిణామాలు, వాయిదా వ్యాపారాల్లో ఉంటే ఈ విషయాలను ఁయంత్రించేందుఁ, సరిచేసేందుఁ బడ్జెట్‌లో ఎలాంటి చర్యలూ ప్రతిపాదించలేదు. ప్రణబ్‌ ముఖర్జీ మాటలను బట్టి చూస్తే ప్రభుత్వం ద్రవ్యోల్బణాఁకి సంస్థాగత కారణాలు గుర్తించి వాటిఁ పరిష్కరించేందుఁ ప్రయత్నిస్తోందట. అది గుర్తించిన కారణాలు ఁజంగా సంస్థాగత కారణాలా కాదా అన్నది ఒక చర్చ. ఆర్థిక సర్వేలో సరుఁలు ప్రజలఁ చేరవేయటంలో లోపం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందఁ అభిప్రాయపడితే బడ్జెట్‌ మాత్రం పప్పు ధాన్యాలు, ఇతర ఆహారోత్పత్తులు ఉత్పత్తిలో కొరత వల్ల ఈ పరిస్థితి తలెత్తిందఁ చెప్తోంది. కానీ ఇద్దరూ చెప్పిన పరిష్కారం ఒక్కటే. ఆహారోత్పత్తులను ప్రజలఁ చేర్చటాఁకి మార్కెట్‌ ఒక్కటే సాధనం అన్నది అటు ఆర్థిక సర్వే, ఇటు బడ్జెట్‌ సూచిస్తున్న పరిష్కారం. పైగా ప్రజలఁ మార్కెట్‌లో నేరుగా సరుఁలు కొనుగోలు చేయటాఁకి వీలుగా డబ్బులు ఇస్తామఁ చెప్తోంది. మరోవైపున ద్రవ్యోల్బణం పెరగటాఁకి మార్కెట్‌లో అవసరాఁకి మించిన డబ్బులు చలామణి కావటం కూడా ఒక కారణమఁ సర్వే చెప్తోంది. ఈ విధంగా ద్రవ్యోల్బణం పరిష్కారం విషయంలో ప్రభుత్వం వైఖరి మోకాలికి, బోడిగుండుఁ ముడేసేదిగా ఉంది. పైగా ద్రవ్యోల్బణం అందుపుకోసం అంటూ ప్ర్రతిపాదించిన అనేక చర్యలు ఁజాఁకి ధరల పెరుగుదలఁ దారితీయనున్నాయి. ప్రజలు ధరల సమస్యను తీవ్రంగా చూడటం లేదఁ ప్రణబ్‌ ముఖర్జీ ఇచ్చిన ఇంటర్వూ ప్రభుత్వం దృక్ఫధాఁకి అద్దం పడుతుంది. పైగా వస్తువులు, సేవల చట్టం అమలు దిశగా మరో 130 రకాల ఉత్పత్తులను ఎక్సైజు పన్ను పరిధిలోకి తేవటం ద్వారా ధరల పెరుగుదలఁ మార్గం సిద్ధం చేసిందీ బడ్జెట్‌.
ఉత్పదకరంగంలో కదలిక తీసుకురావడం
ప్రభుత్వం పారిశ్రామికవేత్తలఁ ప్రకటించిన అనేక రాయితీలు ఈ లక్ష్యసాధనకోసమే అఁ చెప్తున్నారు. ఁజాఁకి ఈ రాయితీలు ఉత్పత్తిరంగంలో కదలిక తేవటాఁకి ఉపయోగపడితే గత సంవత్సరం పారిశ్రామికోత్పత్తి, ప్రత్యేకించి వస్తూత్పత్తి రంగం 8.1 శాతం వృద్ధి రేటు నుండి ఎందుఁ పురోగమించలేదన్న ప్రశ్నఁ బడ్జెట్‌లోనూ, ప్రభుత్వం వద్ద సమాధానం లేదు. వస్తూత్పత్తి రంగం వృద్ధి రేటు సాధించటాఁకి తగిన పరిస్థితులు ఉత్పత్తి వ్యవస్థలోనే కాదు. వాటిఁ విఁయోగించుఁనే సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటాయి. గత రెండేళ్లుగా ఉద్దీపనల పేరుమీద ప్రభుత్వం ప్రకటించిన వరాలు, పన్ను రాయితీలన్నీ రెండో సమస్యను పరిష్కరించలేకపోయాయి. ఈ విషయాఁ్న గుర్తించి సరి చేయటాఁకి బదులు తిరిగి అవే విధానాలు అమలుఁ పూనుఁంటూ సంపన్నులఁ, పారిశ్రామికవ్తేలకూ మరో 5 లక్షల కోట్ల రూపాయల మేర రాయితీలు అమలు చేస్తోంది. గత మూడేళ్లలో కేవలం సంపన్నులఁ ఆదాయపన్ను రూపంలో ఇచ్చిన రాయితీలే రు.3,61,415కోట్లు...
కరెంట్‌ ఖాతా లోటు తగ్గించడం
కరెంట్‌ ఖాతా లోటు తగ్గించుకోవాలంటే ఎగుమతులు పెరగాలి. లేదా దిగుమతులు తగ్గాలి. ప్రభుత్వం మౌలికసదుపాయాల కల్పన ఁమిత్తం దిగుమతి చేసుఁనే వివిథ రకాల యంత్రసామాగ్రికి రాయితీలు ప్రకటించింది, కాబట్టి ఇదే అదనుగా పరిశ్రమలు వీటిఁ తఁ్కవ ఖర్చుఁ దిగుమతి చేసుకోవటాఁకి ప్రయత్నిస్తాయి. దాంతో దిగుమతులు తగ్గే అవకాశం లేదు. ఇక ఎగుమతుల విషయాఁకొస్తే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కోలుఁంటే తప్ప ఈ పరిస్థితిలో మార్పు రాదు. ప్రస్తుతం పశ్చిమాసియా పరిణామాలు, ఉత్తర ఆఫ్రికా పరిణామాలు మొత్తంగా యూరోపియన్‌ ఆర్థిక వ్యవస్థ పురోగతిఁ ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అమెరికాలో, జపాన్‌లో ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. కానీ ఈవిషయాలు పరిగణనలోకి తీసుకోకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కనీసం చమురు ఉత్పత్తుల మార్కెట్‌లో వస్తున్న మార్పులు ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపనున్నాయన్న విషయాఁ్న మాటమాత్రంగా కూడా బడ్జెట్‌లో ప్రస్తావించలేదు. అంతేకాక చమురు ధరల పెంపు సమయంలో ఆ భారం ప్రజలపై పూర్తిగా పడఁండా ఉండటాఁకి గత సంవత్సరం 35వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ సంవత్సరం 20వేల కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించింది. అంటే రానున్న కాలం కనీసం 15 వేల కోట్ల రూపాయల మేర చమురు ధరలు పెరగటం ఖాయం.
బడ్జెట్‌లో అంచనాలన్నీ ప్రస్తుత ఆర్థిక వ్యవస్థ ఇదే తరహా వృద్ధి రేటు సాధిస్తుందఁ, ఎటువంటి అవాంతరాలు ఉండవనే దృష్టితో రూపొందించినవి. ఈ అంచనాల్లో తేడాలొస్తే తీసుకోవాల్సిన ప్రత్యామ్నాయ చర్యల గురించిన ప్రస్తావన లేకపోవటంతో 2011-12 ఆర్థిక సంవత్సరం నడక తీరు మార్కెట్‌ శక్తుల విజృంభణకే ఎక్కువ అవకాశమిచ్చేదిగా ఉంది.

Wednesday, March 2, 2011

శుభాకాంక్షలు


బ్లాగ్ మిత్రులందరికీ మహా శివరాత్రి శుభాకాంక్షలు
మిత్రులారా. ఇది నా మొదటి బ్లాగ్. సమకాలీన విషయాల మీద నా అభిప్రాయాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. సమాజంలో జరుగుతున అన్ని రంగాల మీద మీ అభిప్రాయాలను కూడా పంచుకుంటారని ఆశిస్తున్నాను.